గతకాలం అంతా కాచావు నీ కృపలో -Gathakaalam Antha
గతకాలం అంతా కాచావు నీ కృపలో
వ్యధలన్ని తీరే జతలో…..
ఇన్ని నాళ్ళ ఆనందం దేవా నీవయ్యా…
అన్ని నీవై యుండంగ మదేపొంగి విరబూయ
నూతన వత్సర కాలములో మెండుగ నొసగుము దీవెనలు
సనాతన భావము తొలగించి నను నడిపించు
హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ …
హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్…
ఏ ఘడియలో ఏం జరుగునో తెలిసేదెలా? హృదయానికే
నీ చిత్తమే లేకుండగ బ్రతికేదెలా?
కృతాజ్ఞతే కోరెను లో లో కోరిక
సమాస్తము చేరగ నీ పాద పీఠిక
అందించు నీ హస్తమే దయ నే కోరగ
సంధించు నీ వాక్యమే బ్రతుకే మారగ
హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ …
హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్…
నీ శక్తినే నే పొందగ దిన దినమున దీవించుము
నీ భక్తిలో నేర్పించుము సన్మార్గము
సహాయమై శ్రేయమై నన్నే చేరగ
సునంద సంధ్య రాగ మాల గీతం పాడగ
చలించదా? జ్వలించి నా మనసే నిండుగ
జనించనా? ఫలించి నీలో రోజూ కొత్తగ
హ్యాపీ… న్యూ ఇయర్… బ్లెస్స్ మీ మై డియర్ …
హ్యాపీ… న్యూ ఇయర్… క్లియర్ మై ఫియర్…